My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Friday, April 24, 2020

జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం

"When Panchayat Raj is established, public opinion will do what violence can never do"
- Mahatma Gandhiji

పంచాయతీ రాజ్ దినోత్సవం గురించి...
భారతదేశ చరిత్ర గతిని  గమనిస్తే, స్వీయ ప్రతిపత్తి కల్గిన గ్రామ రాజ్యాల వ్యవస్థ అవగతమవుతుంది. ఉదా - గణతంత్ర వ్యవస్థ గా వర్ధిల్లిన వైశాలి రాజ్యం, చాలా ఉన్నతమైన చోళుల గ్రామీణ పరిపాలనా వ్యవస్థ. 1947 లో స్వాతంత్రం సాధించే నాటికి భారతదేశం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామీణ దేశం. భారత రాజ్యాంగం లో పొందుపరిచిన అధికరణ 40 పంచాయితీ రాజ్ వ్యవస్థ గురించి చాల క్లుప్తంగా ప్రస్తావించింది.  అయితే,ఇది కేవలం ఆదేశిక సూత్రం మాత్రమే. దురదృష్టపుశాత్తు,  వికేంద్రీకరణ దిశగా నిజమైన అడుగులు వేస్తూ,  పంచాయితీ రాజ్ వ్యవస్థ కి రాజ్యాంగ హోదా కల్పించడానికి దాదాపు అర్ధ శతాబ్దం పట్టింది. 

24 ఏప్రిల్ 1993 నుంచి అమలు లోకి వచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)  పంచాయితీ రాజ్ వ్యవస్థ కి గౌరవప్రదమైన చట్టబద్ధత తో కూడిన రాజ్యాంగ హోదా కల్పించింది. ఈ  గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుని, 2010 వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 24 ఏప్రిల్ న జాతీయ పంచాయితీ
రాజ్ దినోత్సవం - National Panchayat Raj Day (NPRD)  గా నిర్ణయించింది. 2018 నాటికి భారతదేశ జనాభా లో స్థూలంగా 65.97% మంది, సుమారు 6,49,481 గ్రామాల లో (వీటిలో 2,50,000 గ్రామాల లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కలదు) నివాసముంటున్నారు - దేనిని బట్టి పంచాయితీ రాజ్ వ్యవస్థ  ఆవశ్యకత తెలుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ విషయం...
02 జూన్ 2014  తదనంతరం, తెలంగాణ రాష్ట్రం  విడిపోయిన తర్వాత, నవ్యంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గణాంకాలను పరిశీలిస్తే పెక్కు శాతం జనాభా గ్రామీణ ప్రాంతం లో నివాసం కలిగినవారు అని తెలుస్తుంది. పంచాయితీ రాజ్ వ్యవస్థ లో నూతనోత్తేజం  నింపుతూ,పారదర్శకత & జావాబుదారీతనం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్భవించింది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులైనటువంటి గ్రామ వాలంటీర్లు వెన్నెముక గా కల్గిన ఈ వ్యవస్థ, గ్రామా సచివాలయం ఒక Unit గా,  పంచాయతీ కార్యదర్శి Co-ordination తో, వివిధ Domain Experts at Village level (Engineering Assistant, Surveyor Assistant etc.,) గ్రామీణ వ్యవస్థ లో మమేకమయ్యేలా మహోద్యమాన్ని తలపెట్టింది. కొరోనా (Corona -Covid 19) దృష్ట్యా ఈ వ్యవస్థ ఎక్కువ Focus లోకి వచ్చింది & పలువురి ప్రశంసలు పొందింది. అయితే, ఈ వ్యవస్థ దేశకాల విపరీత పరిస్థితులను తట్టుకుని నిలబడుతుందా అన్నది ప్రశ్న. కానీ సద్విమర్శలను స్వీకరిస్తూ ఉన్నంత కాలం బహుశా ఏ లోటు వుండకపోవొచ్చు.

మీ అందరికీ జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు.       




వెలువలి మహీత్,
24/04/2020 - జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం,.
పాలకొల్లు.

No comments:

Post a Comment