My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Thursday, February 18, 2021

కాంచీపుర దర్శనం-2

(Continued...)
Note - As per Hindu Mythology

రెండవ రోజు (14/02/2021)
కాంచీపురన్న వెలసిన శైవక్షేత్రాలన్నిటి లోకి సుప్రసిద్ధమైనట్టి ఏకాంబరనాధుని దర్శన తో నా  రెండో రోజు మొదలైంది. కామాక్షీ దేవి శివుని గూర్చి ఇచ్చటనే ఒక మామిడి చెట్టు కింద తపస్సు ఆచరించారని నమ్మకం. దేవాలయ ప్రాంగణం లో వున్న ఒక మామిడి చెట్టు అదే చెట్టుఅని నమ్మకం. శైవ పంచ భూత స్థలాల లో ఈ గుడి భూ స్థలమని ప్రతీతి. ఎత్తైన స్థంబాల తో విశాలంగా వున్న ప్రదక్షిణాపథం ఇక్కడ చాలా ముచ్చట గొల్పుతుంది. దేవాలయము లో కారికల చోళుని విగ్రహం వుంది. 

Me at Vaikuntha Perumal Temple


శివదర్శనం తర్వాత దగ్గర లోనే వున్నా వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించాను. ఇది చారిత్రక కట్టడం. పల్లవ రాజైన రెండవ నందివర్మ కట్టించిన ఈ గుడి యొక్క వాస్తుకళ విశిష్టమైనది. గుడి ప్రదక్షిణాపథం పక్కన గోడల పై పల్లవుల వంశ  స్థాపన, పరిపాలన, యుద్ధాలు - జైత్రయాత్రలు చాలా చూడముచ్చటగా చెక్కబడ్డాయి. పల్లవ గుళ్ల లో వున్న విశేషమైనట్టి సింహ స్థంబాలు ఇక్కడ విరివిగా కలవు. నల్లటి, ఎత్తైన స్వామి వారి విరాట్ స్వరూపాన్ని కాంచి చాలా సంతోషమేసింది.

 

Pradakshina Patha at Ekambranathar Temple
The Legend of Kanchi


అటుపైన, నగర ప్రధాన కూడలి కి దూరంగా వున్న కైలాసనాథుని దేవాలయం దర్శించాను. ఇది కూడా ఒక విశిష్టమైన చారిత్రక కట్టడం. పల్లవ నిర్మాణ కౌశలానికి మచ్చతునక! శివాలయమైన ఈ గుడి లో 58 చిన్నపాటి shrines కలవు - ఒక్కక్క shrine పై చిన్నపాటి niche carving చెక్కబడ్డాయి. ప్రధాన మండపం లో గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణ చేయడం సాహసమే! చిన్న గుహ ద్వారా పాకల్స వస్తుంది. అదో అద్భుతమైన విషయం! ఇకపోతే విమానం బయట వున్నా శిల్ప కళ అత్యద్భుతం! గంగాధరుడైన శివుని Niche carving చాలా ప్రత్యేకమైన అంశం. చిట్టచివరగా, దగ్గర లోనే వున్న పాండవ  పెరుమాళ్ గుడిని దర్శించాను - పాండవ దూత గా శ్రీకృష్ణుని, రుక్మిణీ దేవిని ఇక్కడ ఆరాధిస్తారు. ఇంతటి తో నా కంచి యాత్ర ముగిసింది. మళ్ళీ అదే రోజు చెంగల్పట్టు చేరి సాయంత్రం సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లో వెనక్కి బయల్దేరాను.

 

Kailasanathar Temple - Lateral View
Gangadhara Shiva - Kailasanathar Temple


నేను దర్శించిన దేవాలయాలు
1. చిత్రగుప్త స్వామి
2. కార్చపీశ్వరస్వామి
3. వరదరాజ పెరుమాళ్
4. కంచి కామాక్షి అమ్మన్
5. ఉలగానంద పెరుమాళ్
6. ఏకాంబరేశ్వ స్వామి
7. వైకుంఠ పెరుమాళ్
8. కైలాసనాథ స్వామి
9. పాండవ దూత పెరుమాళ్ స్వామి        


వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-2 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
19/02/2021, - పాలకొల్లు.

No comments:

Post a Comment