(కొండపల్లి కోట, నవంబర్ 2023)
![]() |
కోట వద్ద నేను |
కృష్ణానదికి ఉత్తరాన, విజయవాడ నగరానికి పశ్చిమంగా కొండపల్లి అనే గ్రామముంది. ఇక్కడికి దగ్గర లోనే తూర్పు కనుమలు, కళింగ ఖరవేలుడు 'కన్నబెన్న' నదిగా అభివర్ణించిన కృష్ణానదిని తొలిసారి ముద్దాడాయి, మరియు గోదావరి-కృష్ణా డెల్టా ప్రాంతం ముగిసింది. ఈ గ్రామం పొనికిచెట్టు కలప నుంచి తయారు చేసిన కొండపల్లి బొమ్మలకు, గ్రామపేరు తోనే వున్న కొండపల్లి కోట / ఖిల్లా కు సుప్రసిద్ధి. కొండవీడు కోట తో సమానమైన ప్రశస్తి కలిగిన ఈ కోట తెలుగు వారి మధ్యయుగ చరిత్ర తెలుసుకోవడానికి ఉపయుక్తం.
![]() |
శిథిలాలు |
ఈ కోట కాకతీయులపతన కాలానికే (1323 CE) వున్నది అన్నది నిర్వివాదాంశం. ఆ కాలం లోనే ఈ కోట ఓం ప్రధమంగా ముదిగొండ చాళుక్యులు, ముసునూరి నాయకులు వంటి సామంత రాజ్యాలు, చిన్న చిన్న స్వాతంత్ర్య రాజ్యాల స్వాధీనంలో వుండేది అని శాసన సాక్ష్యం. 14 వ శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్య స్థాపన తో ఆంధ్రదేశం లో ఒక నూతన సూర్యోదయం మొదలయ్యింది. ఇదే కాలం లో ఆంధ్ర దేశ మధ్యభాగాముగా, కొండపల్లి వాసికెక్కింది. అటు తర్వాత కళింగ సూర్యవంశ గజపతులు, గోల్కొండ కుతూబ్షాహీలు, మొగలాయిలు, హైదరాబాద్ నైజాం సంస్థానానికి చెందిన అసాఫ్ ఝాఈలు వరసగా కొండపల్లి ని ఏలారు. చివరకు బ్రిటీష్ వారి హయాంలో కొండపల్లి సైనిక అవసరాలకు స్థావారంగా (Garrison) గా మారింది.
![]() |
కుతూబ్షహీల శాసనం |
'ఖగపతుల్, నరపతుల్, గజపతుల్ సాగించిరి సమరము' అని ఒక మధ్యయుగ కవి తెలిపినట్టుగా, పదిహేనవ శతాబ్దం లో బహమనీలు, గజపతులు, విజయనగర సమ్రజ్యాధీశుల మధ్య మొదలైన త్రైపాక్షిక రణం లో కొండపల్లి ని వశపరుచుకోవడం కీలకమైంది. మొదటగా, సూర్యవంశ గజపతి కపిలేంద్ర దేవుని కొడుకైన హాంవీరదేవ రౌత్రాయా కొండపల్లి ని జయించాడు. సుమారు అర్ధ శతాబ్దం తర్వాత, తన కళింగ జైత్రయాత్ర లో శ్రీ కృష్ణదేవరాయలు, కొండపల్లి కోట ని ముట్టడించాడు. గజపతుల కళింగ రాజ్యానికి కొండపల్లి సుమారు నూరు ఏళ్ళ పాటు దక్షిన సరిహద్దు అయ్యింది.
![]() |
కోట ద్వారం |
నేడు శిథిలమైన కొండపల్లి కోట అత్యంత సుందరమైన ప్రకృతి వడి లో, పచ్చని చెట్ల మధ్య, పూర్వ వైభవం కొదవైనా విరాజిల్లుతోంది. కోట ని రెందు విధాలు గా చేరుకోవొచ్చు - మొదటగా కొండపల్లి గ్రామము ప్రధాన వీధి (కొండపల్లి బొమ్మల చేతిపనివారి ప్రధాన వీధి) నుంచి కొండ వెనకవైపు గా కాలిబాటన ఒక దారి, రెండవది, ఇబ్రహీంపట్నం నుండి రోడ్డు మర్గాం ద్వారా. శిథిలమైన బురూజు దర్వాజాలు రెండు, గదుల తో వున్న తనీషా రాజభవనం, చెరసాల, అత్యంత గంభీరంగా, గత వైభవాన్ని చాటుతూ స్వాగతిస్తాయి. రాష్త్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కొండపల్లి కి విశేష జనాదరణ కల్పించాలి అని కృషి చేస్తొంది. ప్రభుత్వ నూతన పర్యాటక విధానం ఈ దిశగా ఒక మంచి అడుగు.
![]() |
కొండపల్లి బొమ్మ |
కొండపల్లి
మహీత్ వెలువలి,
16 సలాది జమీందార్ వీధి , పాలకొల్లు ,.
31 మే , 2025.