(ది.23/08/2021 సోమవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి ని పురస్కరించుకుని)
రక్త మాంసాలు కల్గిన ఒక మనిషి ఇంత ఆదర్శం గా జీవించారు అని ముందు తరాల వారు నమ్మకపోవొచ్చు అని గాంధీ మహాత్ముని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప మాట చెప్పారు. Scrupulous honesty, unflinching integrity, courage కి నిలువెత్తు నిదర్శనం ఆయన 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తల్చుకుంటే పై మాటే గుర్తుకి వస్తుంది. నేటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం (23 August 1872) లో కటిక దరిద్రం లో జన్మించి, లాయర్ గా కొన్ని తరాల పాటు తరగని ఆస్తి ని సంపాదించి, సహాయ నిరాకరణోద్యమం తో స్వాతంత్ర్య సమరరంగం లో దూకి, చివరకి ఆస్తులన్నీ దేశం కోసం ధారపోసి ప్రాణత్యాగం చేసిన ప్రకాశం గారి జీవితం ఎంతో ఆదర్శం.
రాజమహేంద్రి పురపాలక సంఘ అధ్యక్షుని గా ప్రారంభమైన వారి రాజకీయ జీవితం, ఎన్నో పదవులకు వారు వన్నె తెచ్చే విధంగా దిగ్విజయంగా సాగింది. ఎనాడూ పదవుల వెంట పడకపోయినా, ముక్కుసూటితనం తో, మోండిధైర్యం తో, నిజాయితీ తో వారు ఏ పదవి లోనూ ఎక్కువసేపు కొనసాగలేకపొయారు. స్వాతంత్ర్య సమరంలో వారిది ప్రత్యేక పాత్ర. సహాయ నిరాకరణోద్యమం తో మొదలై, సైమన్ గో బ్యాక్ ఉద్యమం లో భాగంగా మద్రాస్ లో వేరే నాయకులు భయపడుతున్నప్పుడు, బ్రిటిష్ తుపాకి కి ఎదురుగా రొమ్ము చూపి 'అంధ్రకేసరి ' అనిపించుకుని, ఉప్పు సత్యాగ్రహం సమయం లో మరీనా బీచ్ సత్యాగ్రహన్ని ముందుండి నడిపించడం - ఇవన్నీ చిరస్మరణీయం. 1937 లో మద్రాస్ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రి గా, భూసంస్కరణలకై వారు చెసిన ప్రయత్నం విఫలమైనా, ముందు తరాలకు ఒక Blueprint లా అయింది. 1945 లో మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా Firka Development Scheme ని ప్రవేశపెట్టారు.
నాటి కాంగ్రెస్స్ పార్టీ లో అంతర్గత కలహాల వల్ల కొంతకాలం ఆ పార్టీ కి దూరం గా వున్నారు. కాని అందరూ గౌరవించేవారు వారిని. రాబోయే political crisis ని దృష్టి లో వుంచుకుని, చాలా మంది తర్వాత తరం నాయకులని (Neelam Sanjeeva Reddy, Bejawada Gopala Reddy, etc,.) వారు స్వయంగా ప్రోత్సాహించి, leadership vacuum లేకొండా చేసిన దార్శనికులు. పండీట్ నెహ్రూ గారు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, పార్టీ లో లేకపొయినా ప్రకాశం గారినే మొదటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గా వుండడం శ్రేయస్కరమని భావించి, కబురంపించరనడం అతిశయోక్తి కాదు.
చివరి రోజులలో పడ్డ ఆర్ఢిక కష్టాలని లెక్కచెయ్యక, తుదిశ్వాస వరకూ ప్రజాసేవకే అంకితమైన ఆంధ్రకేసరి ని స్మరించుకోవడం ఒక భారతీయుడి గా, ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా అనిపిస్తుంది.
No comments:
Post a Comment