(Note - As per Hindu Mythology)
సుమారు సంవత్సరం తర్వాత రైలు ప్రయాణం చేసిన నన్ను సర్కార్ కోవిడ్ స్పెషల్ ఎక్ష్ప్రెస్స్ ఆహ్లాదభరిత కోవాలాయి సరస్సు పక్కన వున్నా చెంగల్పట్టు జంక్షన్ వద్ద దింపింది. బయటపడి, ఒక 'కాపీ' సేవించి, ఎదురుకుండానే వున్న బస్స్టేషన్ కి వెళ్లి, రోడ్డు మార్గాన్న కంచి ని బస్సులో చేరాను. తమిళం పూర్తిగా రాకపోయినా, అర్ధం చేసుకోగలను - పైగా, ఈ ప్రాంతం ఆంధ్ర సరిహద్దు కి దగ్గర, ఎంతో మంది తెలుగు వారి నిత్యం వచ్చి పోతూవుంటారు - కావున భాష సమస్యే కాదు. పల్లవుల అలనాటి రాజధాని అయిన కంచి పురాతన, ప్రసిద్ధ దేవాలయాలకు, సిల్క్ చీరలకు ప్రతీతి. ప్రధాన బస్టేషన్ కూడా నగరం నడి బొడ్డున వుంది. కాంచిపురన్న వైష్ణవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం విష్ణు కంచి గాను, శైవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం శివ కంచి గాను పిలుస్తారు. ఇవే కాక,. ద్రావిడ సాంప్రదాయం లో కట్టిన జైన దేవాలయాలు కూడా నగరం అవతల కలవు. 1897 లో ఏర్పడిన కంచి పురపాలక సంఘం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్. ఒక చిన్నపాటి లాడ్జి రూము తీస్కుని (రెండవ శనివారం కావున ఎక్కువ సేపు పట్టింది), కాంచీపుర రాజా వీధులలో నిమ్మిత్తమాత్రుడనై పడ్డాను.
మొదటి రోజు (13/02/2021)
ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ అన్ని ప్రసిద్ధ దేవాలయాలు ఉదయం 06:00 గం నుండి నుండి మధ్యాన్నం 12:00 గం వరకు, తిరిగి మధ్యాన్నం 03:00 గం నుండి సాయంత్రం 06:00 గం (కొన్ని సుమారు రాత్రి 08:30 గం' వరకు) వరకు తెరిచి ఉంటాయి. లాడ్జి కి మూడు రూముల అవతలి వున్న చిత్రగుప్తాస్వామి గుడిని ముందర దర్శించాను. బహుశా చిత్రగుప్తునికి వున్న ఏకైక గుడి ఇదేనెమో! సప్త దీపాలు సమర్పించి, కలము, దస్త్రములు చేతబూనిన మూలవిరాట్ చుట్టూరా ఏడు ప్రదక్షిణాలు చేసిన మంచిదని ఇక్కడి ప్రతీతి. చాలా పురాతనమైనదైనా, చిన్న గుడి. కాస్త ముందరే కార్చపీశ్వరుని గుడిని దర్శించాను. కూర్మావతార అయిన విష్ణుమూర్తి శివపూజ చేసినట్టుగా చెపుతారు. ఈ గుడి చాలా విశాలమైనది, కోనేరు కలదినూ, బయట మిట్ట మధ్యాన్నం ఎండ గా వున్నా కూడా, గుడి లోపల విశాలమైన ప్రాంగణం లో ఎత్తైన స్థంబాల మధ్య ఎంతో ఆహ్లాదంగా, చల్లగా అనిపించింది. తమిళనాట ద్రావిడ సాంప్రదాయన కట్టిన గుళ్ళు ఎంతో విశాలమైనవి! తర్వాత దగ్గరలోనే వున్నా కంచి కుడిల్ అనే ఒక ప్రయివేట్ మ్యూజియం ని సందర్శించాను. అక్కడి తో మొదటి రోజు మధ్యాన్నం సమయం సుమారు 12:30 అయింది.
Chitragupta Swamy Temple Kanchi Kamakshi Amman Temple
మధ్యాన్నం 03:00 గం' లకు షేర్ ఆటో మీద 108 వైష్ణవ దివ్యదేశాలన్నిటి లోకి సుప్రసిద్ధమైన వరదరాజ పెరుమాళ్ దేవాలయాన్ని (11వ శతాబ్దం) సందర్శించాను. 23 ఎకరాల విస్తీర్ణం కల్గిన ఈ దేవాలయం లోకి అడుగిడిన వెంటనే ఎడమ వైపు విజయనగర రాజులు కట్టించిన వంద స్థంబాల మండపం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ శిల్ప కళా వైభవం వర్ణనాతీతం. మండపం పక్కనే వున్న కోనేరు లో యోగ నిద్ర లో వున్న మూల విరాట్ ని ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి, 48 రోజుల పాటు ప్రధాన గుడి లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. లోపల ప్రధాన దేవాలయం లో కుడ్య చిత్రాలు చాలా వరకూ పాడైపోయాయి. వరదరాజ పెరుమాళ్ స్వామి గర్భ గుడి మొదటి అంతస్థు లో, పేరుందేవి తాయారు గుడి కొంచెం కింద ఎడమ వైపు కలవు. గర్భాలయం వెనకాలే ప్రసిద్ధ బల్లి శిల్పం గలదు - ఇది ఇప్పుడు ముట్టుకోలేము, కేవలం చూడడం మాత్రమే. తర్వాత మళ్ళీ బస్టేషన్ వైపు షేర్ ఆటో మీద వచ్చి, దగ్గర లోనే వున్న వామమూర్తి అవతారిఐన ఉలగానంద పెరుమాళ్ గుడిని దర్శించాను. అటుపైన, పద్మాసనం లో ప్రసన్నంగా విరాజిల్లిన కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం కల్గినిది. బాలాత్రిపుర సుందరి స్వరూపిణి అయిన కామాక్షి అమ్మావారు ఇక్కడి శివుని గూర్చి ఒక మామిడిచెట్టు కింద తపస్సు చేసారని ప్రతీతి. సాయంత్రం వేళ, రద్దీగా వున్నా కూడా, చక్కటి లైటెనింగ్ కాంతులలో కామాక్షి అమ్మవారి గుడి, కోనేరు, గాయత్రీ మండపం చూడడం ఒక చక్కని అనుభూతి. ఆ విధంగా మొదటి రోజు గడిచినిది.
Stone work at Hundred Pillared Hall Varadaraja Perumal Temple
(To be continued...)
వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-1 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
18/02/2021, - పాలకొల్లు.
No comments:
Post a Comment