My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Thursday, February 18, 2021

At Kanchi - 2

(Continued...)

Note - As per Hindu Mythology

The Second Day (14/02/2021)
The second day had begun with my visit to Ekambranathar Temple, the largest Shaiva temple of Kanchi. As per a belief, the Mango Tree under which Goddess Kamakshi performed a penance for Lord Shiva is located on the temple premises. This temple of Lord Shiva is associated with the element of Land among the Pancha Bhootha Sthalas. The large and ambient Pradakshina Patha with tall and aesthetic Pillars is the most distinguishing feature of this temple. There is a statue of Karikala Chola in the temple.


Me at Vaikuntha Perumal Temple


Later, I visited the Vaikuntha Perumal Temple. It's a historical temple. The sculptures and carvings of this temple builty by Pallava Nandivarman II are exquisite. One can have a glimpse of the entire history of Pallavas on the walls abutting the Pradakshina Patha - their reign and conquest, carved neatly. The Simple Lion motif Pillars of Pallavas can be found in this temple.  It was overwhelmed to watch the Mula Viraat - Vaikuntha Perumal in all his glory!

 

Pradakshina Patha at Ekambranathar Temple
The Legend of Kanchi


Then, it was the time to visit Kailasanathar temple, located far from the city centre. It's also historical temple and perhaps the high watermark of Pallava temple building activity! There are 58 shrines with special niches spread around the main temple, dedicated to Lord Shiva. It's an adventure to make a round around the Pradakshina Patha surrounding the Sanctum Santorum!, because one has to crawl through a small hole! The niches carved at the base of the Vimana are terrific! Perhaps the greatest among them is the niche carving of Gangadhara Shiva. Finally, I have visited Pandava Doota Perumal temple located nearby, wherein Lord Krishna is worshipped as ambassador and negotiator of Pandavas along with Goddess Rukmini. Thus did end my trip to Kanchi. On the same day, I've returned to Chengalpattu and boarded the Circar Covid Special express.

 

Kailasanathar Temple - Lateral View
Gangadhara Shiva - Kailasanathar Temple


The Temples I've visited
1. Chitragupta Swamy
2. Karchapeeswarar
3. Varadaraja Perumal
4. Kanchi Kamakshi Amman
5. Ulagananda Perumal
6. Ekambranathar
7. Vaikuntha Perumal
8. Kailasanathar
9. Pandava Dootha Perumal       


Veluvali Maheeth
At Kanchi - 2 (13th & 14th February 2021)
19/02/2021, - Palakollu.

కాంచీపుర దర్శనం-2

(Continued...)
Note - As per Hindu Mythology

రెండవ రోజు (14/02/2021)
కాంచీపురన్న వెలసిన శైవక్షేత్రాలన్నిటి లోకి సుప్రసిద్ధమైనట్టి ఏకాంబరనాధుని దర్శన తో నా  రెండో రోజు మొదలైంది. కామాక్షీ దేవి శివుని గూర్చి ఇచ్చటనే ఒక మామిడి చెట్టు కింద తపస్సు ఆచరించారని నమ్మకం. దేవాలయ ప్రాంగణం లో వున్న ఒక మామిడి చెట్టు అదే చెట్టుఅని నమ్మకం. శైవ పంచ భూత స్థలాల లో ఈ గుడి భూ స్థలమని ప్రతీతి. ఎత్తైన స్థంబాల తో విశాలంగా వున్న ప్రదక్షిణాపథం ఇక్కడ చాలా ముచ్చట గొల్పుతుంది. దేవాలయము లో కారికల చోళుని విగ్రహం వుంది. 

Me at Vaikuntha Perumal Temple


శివదర్శనం తర్వాత దగ్గర లోనే వున్నా వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించాను. ఇది చారిత్రక కట్టడం. పల్లవ రాజైన రెండవ నందివర్మ కట్టించిన ఈ గుడి యొక్క వాస్తుకళ విశిష్టమైనది. గుడి ప్రదక్షిణాపథం పక్కన గోడల పై పల్లవుల వంశ  స్థాపన, పరిపాలన, యుద్ధాలు - జైత్రయాత్రలు చాలా చూడముచ్చటగా చెక్కబడ్డాయి. పల్లవ గుళ్ల లో వున్న విశేషమైనట్టి సింహ స్థంబాలు ఇక్కడ విరివిగా కలవు. నల్లటి, ఎత్తైన స్వామి వారి విరాట్ స్వరూపాన్ని కాంచి చాలా సంతోషమేసింది.

 

Pradakshina Patha at Ekambranathar Temple
The Legend of Kanchi


అటుపైన, నగర ప్రధాన కూడలి కి దూరంగా వున్న కైలాసనాథుని దేవాలయం దర్శించాను. ఇది కూడా ఒక విశిష్టమైన చారిత్రక కట్టడం. పల్లవ నిర్మాణ కౌశలానికి మచ్చతునక! శివాలయమైన ఈ గుడి లో 58 చిన్నపాటి shrines కలవు - ఒక్కక్క shrine పై చిన్నపాటి niche carving చెక్కబడ్డాయి. ప్రధాన మండపం లో గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణ చేయడం సాహసమే! చిన్న గుహ ద్వారా పాకల్స వస్తుంది. అదో అద్భుతమైన విషయం! ఇకపోతే విమానం బయట వున్నా శిల్ప కళ అత్యద్భుతం! గంగాధరుడైన శివుని Niche carving చాలా ప్రత్యేకమైన అంశం. చిట్టచివరగా, దగ్గర లోనే వున్న పాండవ  పెరుమాళ్ గుడిని దర్శించాను - పాండవ దూత గా శ్రీకృష్ణుని, రుక్మిణీ దేవిని ఇక్కడ ఆరాధిస్తారు. ఇంతటి తో నా కంచి యాత్ర ముగిసింది. మళ్ళీ అదే రోజు చెంగల్పట్టు చేరి సాయంత్రం సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లో వెనక్కి బయల్దేరాను.

 

Kailasanathar Temple - Lateral View
Gangadhara Shiva - Kailasanathar Temple


నేను దర్శించిన దేవాలయాలు
1. చిత్రగుప్త స్వామి
2. కార్చపీశ్వరస్వామి
3. వరదరాజ పెరుమాళ్
4. కంచి కామాక్షి అమ్మన్
5. ఉలగానంద పెరుమాళ్
6. ఏకాంబరేశ్వ స్వామి
7. వైకుంఠ పెరుమాళ్
8. కైలాసనాథ స్వామి
9. పాండవ దూత పెరుమాళ్ స్వామి        


వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-2 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
19/02/2021, - పాలకొల్లు.

At Kanchi-1

 

(Note - As per Hindu Mythology) 

I realized that it was almost one year since I last travelled on train as the Circar Special express brought me to Chengalpattu Junction overlooking the picturesque Kolavai Lake. One 'Kaapi' later, I took the bus to Kanchi from Chengalpattu busstation which is just opposite the railway station. Language was never a problem - Andhra border is close by and Kanchi is a popular destination for many Telugu folks. The former Capital of Pallavas is famed for it's legendary and historical temples and Silk.  The bus station is located at the centre. Apart from Jaina and Buddha Kanchi which are located at the outskirts, Vishnu Kanchi marks the place where almost all major Vishnu temples are located and Siva Kanchi is that part of the City where major Shaiva shrines are located.  The municipality of Kanchi, established as Conjeevaram Municipality in 1897 is also now Distict Headquarters.  After checking into a decent and reasonable lodge room following a prolonged search, I wandered on the streets of Kanchi. 

Me at Karchapeswarar Temple


The First Day (13/02/2021)
The first thing to notice is that the timings of almost all major temples vary from 06:00 AM in the morning till 12:00 PM in the afternoon and again from 03:00 PM in the afternoon till 06:00 PM in the evening (some notable exceptions - till 08:30 PM). Firstly, I visited the Chitragupta Swamy temple, adjacent to my lodge room, perhaps the only temple of it's kind! A famous ritual is followed in this temple - offering of Seven lamps followed by making Seven Pradakshinas. Although the temple is historical, attributed to Medieval Cholas, it is small. A few feet opposite and at a visible distance, lies the temple of Karchapeeswarar, associated with the legend of Lord Vishnu, in his Kurma Avatar worshipping Lord Shiva. The temple is huge with an inbuilt tank and despite the heat outside (it was almost afternoon), the ambiance of the temple ensured a soothing coolness once inside! The temples of Tamil Nadu, in distinct Dravidian architecture are a sight for sore eyes! After a visit to the Kanchi Kudil Private Museum nearby, I took rest for the morning session.

 

Chitragupta Swamy Temple

Kanchi Kamakshi Amman Temple

At 3:00 PM in the afternoon, I took a share auto from the busstation to the Greatest temple among the 108 Divya Desams - the 11th Century (?) Varadaraja Perumal Temple. Spread over 23 acres, the formeost striking feature of this huge temple is the Hundred Pillared Hall located on the left side of the entrace. Words fail to describe the intricate stone work! The mula Viraat of Athi Varadhar / Varadaraja Perumal Swamy is in Yoga Nidra inside the temple tank and once in 40 years, for a period of 48 days, is brought outside and consecrated - an event known as the Raising of Athi Varadhar. The images inside the temple are partially damaged. The sanctum sanctorum of the Lord is located on an elevated floor whereas that of consort Goddess Perundevi Thayar is located below to the left side. Beside the sanctum santorum is the famous Lizard carving on the ceiling - one is not allowed to touch it unlike olden times. After that, I visited and prayed to Vamanamurthi Vishnu at the Ulagananda Perumal temple, which is adjacent to my room. Then, I had the great fortune of visiting the temple of Kanchi Kamakshi Amman. A form of Bala Tripura Sundari, as per a legend, Kanchi Kamakshi Amman prayed to Lord Shiva here under a Mango Tree. It was a great experience to look upon and pray to the graceful Goddess, seated in Padmasana. Thus has ended my first day!

Stone work at Hundred Pillared Hall
Varadaraja Perumal Temple

 

(To be continued...)

Veluvali Maheeth
At Kanchi-1 (13th & 14th, February 2021)
18/02/2021, - Palakollu.

కాంచీపుర దర్శనం-1

(Note - As per Hindu Mythology) 

సుమారు సంవత్సరం తర్వాత రైలు ప్రయాణం చేసిన నన్ను సర్కార్ కోవిడ్ స్పెషల్ ఎక్ష్ప్రెస్స్ ఆహ్లాదభరిత కోవాలాయి సరస్సు పక్కన వున్నా చెంగల్పట్టు జంక్షన్ వద్ద దింపింది. బయటపడి, ఒక 'కాపీ' సేవించి, ఎదురుకుండానే వున్న బస్స్టేషన్ కి వెళ్లి, రోడ్డు మార్గాన్న కంచి ని బస్సులో చేరాను. తమిళం పూర్తిగా రాకపోయినా, అర్ధం చేసుకోగలను - పైగా, ఈ ప్రాంతం ఆంధ్ర సరిహద్దు కి దగ్గర, ఎంతో మంది తెలుగు వారి నిత్యం వచ్చి పోతూవుంటారు - కావున భాష సమస్యే కాదు. పల్లవుల అలనాటి రాజధాని అయిన కంచి పురాతన, ప్రసిద్ధ దేవాలయాలకు, సిల్క్ చీరలకు ప్రతీతి.  ప్రధాన బస్టేషన్ కూడా నగరం నడి  బొడ్డున వుంది.  కాంచిపురన్న వైష్ణవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం విష్ణు కంచి గాను, శైవ దేవాలయాలన్నీ వున్నా ప్రాంతం శివ కంచి గాను పిలుస్తారు. ఇవే కాక,. ద్రావిడ సాంప్రదాయం లో కట్టిన జైన దేవాలయాలు కూడా నగరం అవతల కలవు. 1897 లో ఏర్పడిన కంచి పురపాలక సంఘం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్.  ఒక చిన్నపాటి లాడ్జి రూము తీస్కుని (రెండవ శనివారం కావున ఎక్కువ సేపు పట్టింది), కాంచీపుర రాజా వీధులలో నిమ్మిత్తమాత్రుడనై పడ్డాను. 

 
Me at Karchapeswarar Temple


మొదటి రోజు (13/02/2021)
ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన  విషయం, ఇక్కడ అన్ని ప్రసిద్ధ దేవాలయాలు ఉదయం 06:00 గం నుండి నుండి మధ్యాన్నం 12:00 గం వరకు, తిరిగి మధ్యాన్నం 03:00 గం నుండి సాయంత్రం 06:00 గం (కొన్ని సుమారు రాత్రి 08:30 గం' వరకు) వరకు తెరిచి ఉంటాయి. లాడ్జి కి మూడు రూముల అవతలి వున్న చిత్రగుప్తాస్వామి గుడిని ముందర దర్శించాను. బహుశా చిత్రగుప్తునికి వున్న ఏకైక గుడి ఇదేనెమో! సప్త దీపాలు సమర్పించి, కలము, దస్త్రములు చేతబూనిన మూలవిరాట్ చుట్టూరా ఏడు  ప్రదక్షిణాలు చేసిన మంచిదని ఇక్కడి ప్రతీతి. చాలా పురాతనమైనదైనా, చిన్న గుడి. కాస్త ముందరే కార్చపీశ్వరుని గుడిని దర్శించాను. కూర్మావతార అయిన విష్ణుమూర్తి శివపూజ చేసినట్టుగా చెపుతారు. ఈ గుడి చాలా విశాలమైనది, కోనేరు కలదినూ, బయట మిట్ట మధ్యాన్నం ఎండ గా వున్నా కూడా, గుడి లోపల విశాలమైన ప్రాంగణం లో ఎత్తైన స్థంబాల మధ్య ఎంతో ఆహ్లాదంగా, చల్లగా అనిపించింది. తమిళనాట ద్రావిడ సాంప్రదాయన కట్టిన గుళ్ళు ఎంతో విశాలమైనవి! తర్వాత దగ్గరలోనే వున్నా కంచి కుడిల్ అనే ఒక ప్రయివేట్ మ్యూజియం ని సందర్శించాను. అక్కడి తో మొదటి రోజు మధ్యాన్నం సమయం సుమారు 12:30 అయింది. 

 

Chitragupta Swamy Temple

Kanchi Kamakshi Amman Temple

మధ్యాన్నం 03:00 గం' లకు షేర్ ఆటో మీద 108 వైష్ణవ దివ్యదేశాలన్నిటి లోకి సుప్రసిద్ధమైన వరదరాజ పెరుమాళ్ దేవాలయాన్ని (11వ శతాబ్దం) సందర్శించాను. 23 ఎకరాల విస్తీర్ణం కల్గిన ఈ దేవాలయం లోకి అడుగిడిన వెంటనే ఎడమ వైపు విజయనగర రాజులు కట్టించిన వంద స్థంబాల మండపం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ శిల్ప కళా వైభవం వర్ణనాతీతం. మండపం పక్కనే వున్న కోనేరు లో యోగ నిద్ర లో వున్న మూల విరాట్ ని ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి, 48 రోజుల పాటు ప్రధాన గుడి లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. లోపల ప్రధాన దేవాలయం లో కుడ్య చిత్రాలు చాలా వరకూ పాడైపోయాయి. వరదరాజ పెరుమాళ్ స్వామి గర్భ గుడి మొదటి అంతస్థు లో, పేరుందేవి తాయారు గుడి కొంచెం కింద ఎడమ వైపు కలవు. గర్భాలయం వెనకాలే ప్రసిద్ధ బల్లి శిల్పం గలదు - ఇది ఇప్పుడు ముట్టుకోలేము, కేవలం చూడడం మాత్రమే. తర్వాత మళ్ళీ బస్టేషన్ వైపు షేర్ ఆటో మీద వచ్చి, దగ్గర లోనే వున్న వామమూర్తి అవతారిఐన ఉలగానంద పెరుమాళ్ గుడిని దర్శించాను. అటుపైన, పద్మాసనం లో ప్రసన్నంగా విరాజిల్లిన కామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం కల్గినిది. బాలాత్రిపుర సుందరి స్వరూపిణి అయిన కామాక్షి అమ్మావారు ఇక్కడి శివుని గూర్చి ఒక మామిడిచెట్టు కింద తపస్సు చేసారని ప్రతీతి. సాయంత్రం వేళ, రద్దీగా వున్నా కూడా, చక్కటి లైటెనింగ్ కాంతులలో కామాక్షి అమ్మవారి గుడి, కోనేరు, గాయత్రీ మండపం చూడడం ఒక చక్కని అనుభూతి. ఆ విధంగా మొదటి రోజు గడిచినిది.

Stone work at Hundred Pillared Hall
Varadaraja Perumal Temple

 

(To be continued...)

వెలువలి మహీత్
కాంచీపుర దర్శనం-1 (13 & 14వ తేదీలు, ఫిబ్రవరి 2021)
18/02/2021, - పాలకొల్లు.