My travels is all about... My views, thoughts and experiences on/about/at/with random places of interest, persons, things, events, issues etc,. I am an eternal student with a restless mind and a tumultuous heart!

Wednesday, February 5, 2020

కుమార భీమారామం

Temple Tank - Koneru

చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా పంచా-రామ శైవ క్షేత్రాలన్నిటిలోకి పేరెన్నిక గాంచిన క్షేత్రాలు రెండు - ద్రాక్షారామం, సామర్లకోట. సామర్లకోట లో వున్న శివాలయం - కుమారా భీమారామం గా ప్రసిద్ధి. ఇక్కడ పార్వతి దేవి బాలా త్రిపురసుందరి గా వెలిశారు. ఈ గుడిని తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు 9వ  శతాబ్దం లో నిర్మించినట్టు చెపుతారు (ఆయన  పాలనా కాలం - 892-921 CE).

An Inscription inside temple
Model of Temple

ఈ గుడి లో అనేక విశిష్టమైన విశేషాలు కలవు. గర్భాలయం రెండు భారీ ప్రకార గోడల లోపల వుంది. కోనేరు కుడా కలదు. ప్రధాన ద్వారం ద్వారా ప్రేవేశించిన వెంటనే ఎడమ వైపు కాలభైరవ స్వామి ఆలయం కలదు - ఈయన క్షేత్ర పాలకుడు. లోపల వున్నా రెండో ప్రాకార గోడ పై అనేక చిన్నపాటి  శిల్పాలు (సప్తమాత్రికలు, విలుకాడు etc), శాసనాలు వున్నాయి. రెండో ప్రాకార ద్వారం గుండా ప్రవేశించాక, ఒక భారీ నంది దర్శిస్తుంది. గర్భాలయం ముందు ప్రదక్షిణాపథం తో పాటు కొద్దిపాటి విశాలమైన స్థలం కలదు. ఇటీవల తవ్వకాలలో బయల్పడిన శిల్పాలు ప్రదక్షిణాపథం వద్ద చాల కన్పిస్తాయి - ఇందులో ఒకటి చాళుక్య సేనాపతి అయినా ఛన్దరాసి కి చెందినదిగా భావిస్తున్నారు. గర్భాలయం శిఖరం కి ఆనుకుని వున్నా గోడ పై దక్షిణం వైపు రెండు నాట్యకత్తెల శిల్పాలు వున్నాయి. ప్రధాన గర్భాలయం ద్వారం పై గజలక్ష్మి motif కలదు - ఇది తూర్పు చాళుక్యుల గుళ్ళ  లక్షణం. రెండు అంతస్తులు గా వున్న గర్భగుడి పై అంతస్థు లో పశ్చిమ దిక్కున ఒక స్థంభం పై లింగోద్భవ మూర్తి శిల్పం, దాని కింద కోలాటం చేస్తున్న స్త్రీల చిన్నపాటి శిల్పాలు చెక్కబడ్డాయి. తూర్ప చాళుక్యుల తదనంతరం రెడ్డి  రాజులు, ముసునూరి నాయకులు ఈ దేవాలయానికి అనేక మార్పూలు చేయదలచినా కుడా, ఈ గుడి పై తూర్పు చాళుక్యుల ప్రభావం మాత్రమే ఎక్కువ కన్పిస్తుంది. అందుకే, బహుశా ఇక్కడ గోపురాలు కుడా లేవు.

The Temple
Lingodhbhava Murthi - west pillar inside Garbha Griha

చరిత్ర కి, భక్తి కి సమప్రాధాన్యత కల్గిన ఇలాంటి గుడి కి వెళ్ళడం, దర్శించడం మనస్సుని  ఆహ్లాదపరిచింది.

Dancers Galore...
Mythology /స్థలపురాణం  - అసలు పంచారామాలు ఏమిటి ? (Warning - story based on faith/Hindu Mythology)
మార్కండేయ పురాణము  లో వున్న తారకాసుర వధ గాధ ఆధారంగా పంచారామ క్షేత్రాలు ఉద్భవించాయి. దేవతలకి, రాక్షసులకు జరిగిన సంగ్రామం లో దేవతల సేనాదక్షుడైన కార్తెకేయుడు తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. అయితే, తారకాసురుని మృతి తో  అతని వద్ద ఎంతో తపస్సు తో పొందిన శివుని ఆత్మ లింగం ముక్కలై ఐదు భాగాలు గా భూమి పై రాలాయాని చెపుతారు. కాలక్రమేణా, ఆ ఐదు పూర్తి లింగాలు గా పునఃప్రతిష్టిచబడి, దేవాలయాలు గా వెలసాయన్నది ఒక వాదన. ఇట్టివి -
1. ద్రాక్షారామం (తూర్పు గోదావరి)
2. సామర్లకోట (తూర్పు గోదావరి)
3. పాలకొల్లు (పశ్చిమ గోదావరి)
4. భీమవరం - గుణుపూడి (పశ్చిమ గోదావరి)
5. అమరావతి (గుంటూరు)


With Supriya Madam, Srinivas Sir and friends - Harsha Garu &Janaki Ramachandra Garu



వెలువలి మహీత్,
05/02/2020 - Palakollu. 

8 comments:

  1. చక్కటి పోస్ట్. యువత గుళ్ళనీ గోపురాలనీ విశ్లేషణాత్మకంగా దర్శించి వివరించే ప్రయత్నం ముదావహం.

    ReplyDelete