జనవరి 2వ తారీకున మా బామ్మగారి సంవత్సరీకం. సరిగ్గా జనవరి 1, 2010న వారు కాలం చేయాడం జరిగింది. నాకు వూహ తెలిసిన నాటి నుండి (అంతకన్నా ముందు నుంచే) మా బామ్మ నడవ లేక మంచం పట్టింది. నాన్నగారు, ఎన్నో రకాల వైద్యాలు, వైద్యులను సంప్రదించినా లాభం లేకపోయింది. అయితే బామ్మ మటుకు ఎప్పుడూ చాలా సరదాగా ఉండేది మాతో. చాలా ధైర్యంగా, నవ్వుతూ ఉండేది.
రోజూ లేచి, మా అమ్మ తో 'గీతా , కొంచెం కాఫి చుక్క ఉంటే ఇవ్వవే' అనేది. 'కాఫీ చుక్క ' అన గానే భలే నవ్వు వచ్చేది. మా బామ్మ అవసరాలకు ప్రత్యేకంగా 'ఆది లక్ష్మి' అనే ఆవిడ ఉండేది.
స్నానం తర్వాత నేను ఈనాడు పేపర్ తీసుకుని, మా బామ్మ కు వార్తలు చదివి వినిపించేవాడిని. మా బామ్మ ఏమో నేను చదివే వార్తలు, ప్రాపంచిక విషయాలు గురించి కాకొండ , నా తెలుగు ఉచ్చారణ గురించే ఎక్కువ పట్టించుకునేది. 'చేపట్టిన ' అనే మాటను ఎప్పుడు నేను 'చపట్టినా' అని పలికేయేవాడిని. అది కరక్ట్ చెయ్యాలి అని బామ్మ పట్టు పట్టి మరీ ఆ మాట వచ్చిన వార్తలను నా చేత ఇంకా గట్టిగ చదివించేది. అలాగే ఒక సారి నేను స్కూల్ మారినప్పుడు తెలుగు అక్షరాలు రాసుకు రమన్నారు హోమ్ వర్క్ లాగ . అప్పుడు నాకు బామ్మా వల్లనే అంతరించిపోయిన కొన్ని తెలుగు అక్షరాలు (ఆలు, ఆలూ ) గురించి తెలిసింది.
అలా ఇప్పటికి 'చేపట్టిన ' అనే మాట విన్నప్పుడల్లా నాకు మా బామ్మే గుర్తుకు వస్తుంది.
1. Place and Date
@ - Bhrama Apartments (Ground Floor), #16-7-16, Saladi Jamindar Street, Palakollu (West Godavari), Andra Pradesh - 534 260
On - Monday, 1st of January, 2018.
2. బామ్మ జ్ఞాపకం
మా బామ్మ కి . శే . భ్రమరాంబ ( 1929 - 2010) గురించి ఒక చిన్న జ్ఞాపకం .
A small memory, in fond remembrance of my Grandmother (Paternal)
No comments:
Post a Comment